'నా సామిరంగ' 8 రోజుల వసూళ్లు ఇవే!

  • ఈ నెల 14న విడుదలైన 'నా సామిరంగ'
  • ప్రధానమైన అంశాలుగా యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ 
  • 8 రోజుల్లో 44.8 కోట్ల వసూళ్లు
  • బలపడిన నాగ్ సంక్రాంతి సెంటిమెంట్

నాగార్జున తన కెరియర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వచ్చారు. అలా కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆయన 'నా సామిరంగ' సినిమా చేశారు. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. 

ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి థియేటర్స్ లో వెంకటేశ్ .. మహేశ్ బాబు సినిమాలు ఉన్నాయి. అయినా నాగార్జున వెనక్కి తగ్గకుండా థియేటర్స్ లో దిగిపోయాడు. ఈ సినిమా విడుదలై నిన్నటితో 8 రోజులు పూర్తయ్యాయి. ఈ 8 రోజులలో ఈ సినిమా 44.8 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా తెలియజేస్తూ కొత్త పోస్టర్ ను వదిలింది. 

ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. అంతేకాదు పండుగ రోజుల్లోనే ఈ కథ నడుస్తుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. రొమాన్స్ ఈ కథలో చోటుచేసుకున్నాయి. అందువలన చాలా ఫాస్టుగా ఈ సినిమా కనెక్ట్ అయింది. నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంటుంది. ఈ సినిమా సక్సెస్ తో ఆయన సెంటిమెంట్ మరింత బలపడిందనే చెప్పాలి.


More Telugu News