అయోధ్యలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. 13 వేల మంది పోలీసుల మోహరింపు

  • భద్రతా వలయంలో యావత్ అయోధ్య నగరం
  • నగరంలో 10 వేల సీసీకెమెరాల ఏర్పాటు, కృత్రిమే మేధ సాయంతో నిఘా
  • పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, వాహనాల తనిఖీలు
  • ప్రధాన మార్గాల్లో పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు
  • సరయూ నదీ తీరం వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ పహారా
దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రామభక్తులు హాజరవుతున్న  రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశాయి. మొత్తం 13 వేల మంది బలగాలతో గట్టి నిఘా పెట్టారు. యావత్ నగరం భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. 

ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటూ ఏటీఎస్ కమేండోలు, సీఆర్‌పీఎఫ్ దళాలు, డ్రోన్ జామర్లను ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, స్నిపర్లనూ మోహరించారు. నగరంలో మొత్తం పదివేల సీసీకెమెరాలో కృత్రిమ మేధ సాయంతో పటిష్ఠ నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. డ్రోన్లతో నగరంపై నిఘా పెట్టారు. 

నగరంలో ధరంపత్, రాంపత్ హనుమాన్ గర్హీ ప్రాంతం, అష్రఫీ భవన వీధుల్లో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. సరయూ నదీ వెంబడి ఎన్డీఆర్ఎఫ్, ఎడ్డీఆర్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తున్నారు. అయోధ్యకు వెళ్లే అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ప్రత్యేక పాసులు ఉన్న వారిని మాత్రమే ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు.


More Telugu News