'జైలర్' సీక్వెల్ కి రజనీ గ్రీన్ సిగ్నల్!
- క్రితం ఏడాది విడుదలైన 'జైలర్'
- 600 కోట్లకి పైగా రాబట్టిన వసూళ్లు
- రజనీ క్రేజ్ తగ్గలేదని నిరూపించిన సినిమా
- సీక్వెల్ దిశగా మొదలైన కసరత్తు
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను రూపొందించాడు. 2023 ఆగస్టు 10వ తేదీన తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలో .. ప్రతి భాషలో వసూళ్ల పరంగా దూసుకుపోయింది. 600 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది .. ప్రపంచవ్యాప్తంగా రజనీకి ఉన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదని నిరూపించింది.
కథలో భాగంగా ఈ సినిమాలో జాకీష్రాఫ్ .. మోహన్ లాల్ .. శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో మెరిశారు. నెల్సన్ కథాకథనాలు .. రజనీ లుక్ .. ఆయన మార్క్ స్టైల్ .. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాయి. వినాయకన్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ విలనిజం ఏ సినిమాలోను కనిపించలేదు.
అలాంటి ఈ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచన ఆచరణగా మారిపోయింది. నెల్సన్ వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రస్తుతం నెల్సన్ అందుకు సంబంధించిన పనిలోనే ఉన్నాడని చెబుతున్నారు. సమాజానికి హాని చేయడానికి ప్రయత్నించిన కొడుకును చంపడానికి వెనుకాడని ఒక 'జైలర్' కథ ఇది. ఇప్పుడు అందరిలో ఒకటే ఆసక్తి తలెత్తుతుంది. 'జైలర్ 2' కథ ఎక్కడి నుంచి మొదలవుతుందా అని!