కాంగ్రెస్ ప్రధాని ఉండుంటే మణిపూర్ లో పరిస్థితి మరోలా ఉండేది: రాహుల్ గాంధీ

  • మణిపూర్ లో కొన్ని నెలలుగా హింస
  • మోదీ ఇప్పటివరకు మణిపూర్ ను సందర్శించలేదన్న రాహుల్
  • మోదీ తలుచుకుని ఉంటే మూడ్రోజుల్లో హింసకు అడ్డుకట్ట పడేదని వ్యాఖ్యలు
  • కానీ బీజేపీ ఆ విధంగా చేయడంలేదని విమర్శలు
మణిపూర్ లో హింస నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రధాని ఉండుంటే మణిపూర్ లో పరిస్థితులు మరోలా ఉండేవని అన్నారు. 

హింస చెలరేగిన మూడో రోజే కాంగ్రెస్ ప్రధాని మణిపూర్ ను సందర్శించేవారని, ఆ మరునాడే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను కట్టడి చేసేవారని స్పష్టం చేశారు. 

కానీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్ లో కొన్నినెలలుగా హింస చోటుచేసుకుంటున్నప్పటికీ, ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే, కేవలం మూడ్రోజుల్లోనే సైన్యం సాయంతో మణిపూర్ లో పరిస్థితులను చక్కదిద్ది ఉండేవారని స్పష్టం చేశారు. కానీ, బీజేపీ ఆ విధంగా చేయడంలేదని విమర్శించారు.


More Telugu News