రేపు రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ... అయోధ్యకు భారీగా తరలివస్తున్న సాధువులు

  • జనవరి 22న అయోధ్యలో  రామ మందిరం ప్రారంభోత్సవం
  • దేశం నలుమూలల నుంచి వస్తున్న సాధువులు
  • అయోధ్యలోని తీర్థ క్షేత్రపురంలో సాధువులకు బస
  • రేపటి కార్యక్రమంలో 4 వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా 
అయోధ్యలో రేపు బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ మహా సంరంభంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు అయోధ్యకు భారీగా తరలి వస్తున్నారు. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న సాధువులతో అయోధ్య కిటకిటలాడుతోంది. ప్రత్యేకంగా ఏర్పాటు  చేసిన తీర్థ క్షేత్రపురంలో సాధువులకు బస ఏర్పాటు చేశారు. రేపటి రామ మందిర ప్రారంభోత్సవంలో దాదాపు 4 వేల మంది సాధువులు పాల్గొంటారని అంచనా. ప్రస్తుతం అయోధ్య నగరంలో ఎక్కడ చూసినా అధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో నగరాన్ని అలంకరించారు. అందమైన ముగ్గులు, రామాయణ విశిష్టతను చాటే చిత్రాలతో అయోధ్య కనువిందు చేస్తోంది.


More Telugu News