ఆఫ్ఘనిస్థాన్ లో కూలిపోయింది భారత్ విమానం కాదన్న డీజీసీఏ
- ఆఫ్ఘనిస్థాన్ లోని తోప్ ఖానా ప్రాంతంలో విమాన ప్రమాదం
- భారత్ కు చెందిన విమానం అంటూ ఆఫ్ఘన్ మీడియాలో వార్తలు
- అది మొరాకో విమానం అని వెల్లడించిన డీజీసీఏ
ఆఫ్ఘనిస్థాన్ లో ఇవాళ ఓ ప్రయాణికుల విమానం కూలిపోయింది. విమానం కూలిపోయిన విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం నిర్ధారించింది.
అయితే ఆ విమానం భారత్ కు చెందినదంటూ జరుగుతున్న ప్రచారంపై డీజీసీఏ (డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) స్పందించింది. ఆఫ్ఘనిస్థాన్ లో కూలిపోయిన విమానం భారత్ కు చెందినది కాదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఆ విమానం మొరాకో దేశానికి చెందినదని వెల్లడించింది.
ఈ ఉదయం ఆఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత ప్రాంతంలో విమానం కూలిపోయిన ఘటనపై స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ విమానం ఢిల్లీ నుంచి మాస్కో వెళుతున్నట్టు ఆఫ్ఘన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కథనాలపైనే డీజీసీఏ స్పందించింది. అది మొరాకోకు చెందిన ఓ చిన్న విమానం అని తెలిపింది.