ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలం.. ఇంగ్లండ్‌కు షిఫ్ట్ అయిన పాక్ మాజీ కెప్టెన్!
- టెస్టు జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ అహ్మద్
- భార్యా పిల్లలతో కలిసి యూకే షిఫ్ట్ అయినట్టు వార్తలు
- ఇలాంటి వార్తలు వినాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన
తాను ఇంగ్లండ్ వెళ్లిపోయినట్టు వస్తున్న వార్తలను పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టిపడేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 36 ఏళ్ల సర్ఫరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టు జట్టులో ఆశ్చర్యకరంగా చోటు సంపాదించుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు.
ఈ ఘోర ప్రదర్శన తర్వాత సర్ఫరాజ్ తన భార్య, పిల్లలను తీసుకుని యూకేకు వెళ్లిపోయినట్టు వార్తలు షికారు చేశాయి. ఈ పుకార్లపై ఓ ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ పాకిస్థాన్‌ను విడిచిపెట్టాలన్న ఆలోచన కూడా ఎప్పుడూ తన మనసులోకి రాలేదని చెప్పుకొచ్చాడు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమని తేల్చి చెప్పాడు. ఇలాంటి పుకార్లు ప్రచారం చేయడానికి ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని హితవు పలికాడు. ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు.