బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపుల కేసు... కువైట్‌లో ఉంటున్న ఖాసింపై లుకౌట్ నోటీసులు
- తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ ఫిర్యాదు
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేసిన సీసీఎస్ పోలీసులు
- నిందితుడిని కువైట్‌లో ఉంటున్న మహమ్మద్ ఖాసింగా గుర్తింపు
బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ చేస్తున్న వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. మహమ్మద్ ఖాసిం అనే వ్యక్తి పద్నాలుగేళ్లుగా కువైట్‌లో ఉంటున్నాడు. అతను ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌ను బెదిరింపులకు గురి చేశాడు. వీవోఐపీ నెంబర్లను ఉపయోగించి కాల్ లొకేషన్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాఫ్తు చేపట్టి... ఆ ఫోన్ కాల్ కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని మహమ్మద్ ఖాసింగా గుర్తించి లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫోన్లో బెదిరించారని, హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నారని రాజాసింగ్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి తనకు ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలిపారు. రాజాసింగ్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.
మహమ్మద్ ఖాసిం చాంద్రాయణగుట్టకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అంతకుముందు అతను సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా కువైట్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఖాసిం పాస్ పోర్ట్ వివరాలను సేకరించిన సైబర్ క్రైమ్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దు చెక్ పోస్టులకు సర్క్యులర్ జారీ చేశారు.