నాడు ఎన్టీఆర్ ఇచ్చిన సలహా ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో ఉపయోగపడింది: చిరంజీవి

  • విశాఖలో ఎన్టీఆర్ వర్థంతి, ఏఎన్నార్ శతజయంతి కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి
  • తనకు ఫ్యాన్సీ కార్లు అంటే మోజు అని వెల్లడి
  • కానీ ఎన్టీఆర్ సూచనతో ఆలోచన మార్చుకున్నానని వివరణ
లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు విశాఖలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం, ఏఎన్నార్ శతజయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ చిరంజీవి ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ ఇచ్చిన ఓ సలహా ఎలా ఉపయోగపడిందో వివరించారు. 

"నా కెరీర్ తొలినాళ్లలో ఫ్యాన్సీ కార్లు అంటే మోజు ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా, రెక్కలు విచ్చుకున్నట్టుగా తెరుచుకునే డోర్లు ఉన్న టయోటా కారు బాగా నచ్చింది. ఆ సమయంలో ఎన్టీఆర్ గారు ఒక సలహా ఇచ్చారు. వస్తు వాహనాలపై పెట్టుబడి పెట్టవద్దని, భూములు కొనమని సూచించారు. 

ఆయన చెప్పింది అక్షరాలా పాటించాను... స్థలాలు కొన్నాను. ఇవాళ నేను, నా కుటుంబం హాయిగా బతుకుతున్నామంటే ఎన్టీఆర్ ఇచ్చిన సలహానే కారణం. ఆయన మద్దతును నేనెప్పటికీ మర్చిపోను. ఇవాళ నా సినిమాల పారితోషికం కంటే ఆ స్థలాల విలువే ఎక్కువ" అని చిరంజీవి పేర్కొన్నారు.


More Telugu News