అయోధ్య రామ మందిరానికి బాహుబలి తాళం... వీడియో ఇదిగో!
- ఈ నెల 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ
- జనవరి 20న ముడుపుల సమర్పణ
- అలీగఢ్ జిల్లా నుంచి కానుకగా 400 కిలోల భారీ తాళం
- తాళం తయారీకి 6 నెలల సమయం
అయోధ్యలో ఈ నెల 22న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో, జనవరి 20న కానుకల సమర్పణ క్రతువు నిర్వహించారు. ఇందులో భాగంగా అయోధ్య రామయ్యకు దేశం నలుమూలల నుంచి కానుకలు వెల్లువెత్తాయి.
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన భక్తులు అయోధ్య రామ మందిరానికి సమర్పించేందుకు బాహుబలి తాళంను తీసుకువచ్చారు. ఓ భారీ ట్రక్కులో దీన్ని అయోధ్యకు తరలించారు. దీన్ని కిందికి దించడానికి ఓ క్రేన్ ఉపయోగించారు.
ఈ తాళం బరువు 400 కిలోలు. దీని తాళం చెవి కూడా దీని సైజులోనే ఉంది. ఈ మహా తాళం తయారీకి ఆరు నెలలు పట్టిందట. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటోంది.