అయోధ్యలో అత్యవసర సేవల చిరు ఆసుపత్రి ‘భీష్మ’!
- త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు చెప్పిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
- అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఈ మొబైల్ యూనిట్ సిద్ధం చేసినట్టు వెల్లడి
- యూపీ ప్రభుత్వంతో కలిసి అయోధ్యలో సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్టు వివరణ
అయోధ్యలో శ్రీరామమందిర సందర్శనకు తండోపతండాలుగా తరలివచ్చే భక్తుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకల సౌకర్యాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక విపత్తుల సమయాల్లో అత్యవసర వైద్యం అందించేందుకు ‘భీష్మ’ పేరిట ఓ చిన్న మొబైల్ ఆసుపత్రిని అందుబాటులో ఉంచనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సమగ్రవైద్య సేవలు అందించనున్నట్టు తెలిపింది.
ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఘనాకారంలో ఉండే ‘భీష్మ’లో అత్యాధునిక వైద్య పరికరాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.