తెలంగాణలో నేటి నుంచి పలు రైళ్లకు అదనపు హాల్టులు

  • హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరి రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించనున్న పలు రైళ్లకు అదనపు హాల్టులు
  • నేటి నుంచి ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్న రైల్వే శాఖ
  • నల్గొండలో ఆగనున్న నర్సాపూర్‌, విశాఖ, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు
రైల్వే శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. శనివారం (నేడు) నుంచి ప్రయోగాత్మకంగా ఆరు నెలలపాటు తెలంగాణలో పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్టు  తెలిపింది. ఈ నిర్ణయం 20వ తేదీ నుంచి ఆచరణలోకి వస్తుందని, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరి రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లకు ఈ హాల్టులు ఉంటాయని స్పష్టం చేసింది. 

నారాయణాద్రి విశాఖ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు మిర్యాలగూడలో ఆగనున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఇక నర్సాపూర్‌, విశాఖ, చెన్నై సెంట్రల్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లు నల్గొండలో, నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మిర్యాలగూడలో ఆగుతాయి. దక్షిణ ఎక్స్‌ప్రెస్‌ జమ్మికుంట స్టేషన్‌లో, హజ్రత్‌ నిజాముద్దీన్‌ గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ వరంగల్‌, పెద్దపల్లి స్టేషన్లలో అదనంగా ఆగనున్నాయని వివరించింది. 

మరోవైపు నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ నల్గొండలో ఆగుతుందని తెలిపింది. హైదరాబాద్‌-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ గద్వాలలో, అంబేడ్కర్‌నగర్‌-యశ్వంత్‌పూర్‌, నాగర్‌సోల్‌-చెన్సై సెంట్రల్‌, గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ మహబూబ్‌నగర్‌లో అదనంగా ఆగుతాయని పేర్కొంది. యశ్వంత్‌పూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ షాద్‌నగర్‌, జడ్చర్ల స్టేషన్లలో, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌, సికింద్రాబాద్‌-రాయ్‌పూర్‌ హిస్సార్‌, హైదరాబాద్‌-రాక్సల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్‌-బీదర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ మర్పల్లి స్టేషన్‌లో ఆగనున్నాయని వివరించింది.


More Telugu News