హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన చిరంజీవి

  • రేపు విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమం
  • యండమూరి వీరేంద్రనాథ్ కు సాహితీ పురస్కారం
  • ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి విశాఖ వచ్చారు. రేపు (జనవరి 20) లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొననున్నారు. కాగా, లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నారు. 

ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ, తమ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని వెల్లడించారు. సభాధ్యక్షుడిగా హైకోర్టు జడ్జి జస్టిస్ ఆకుల శేషసాయి వ్యవహరిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు సాహితీ పురస్కారం ప్రదానం చేస్తామని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పారు.


More Telugu News