రామోజీ ఫిలింసిటీలో క్రేన్ కూలిపోయి సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో మృతి
- సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న విస్టెక్స్ సంస్థ
- అతిథులను క్రేన్ ద్వారా వేదికపై దించే ప్రయత్నం విషాదాంతం
- క్రేన్ తీగలు తెగిపోయి కూలిపోయిన కంపార్ట్ మెంట్
హైదరాబాద్ శివార్లలోని ప్రఖ్యాత రామోజీ ఫిలింసిటీలో ఓ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ కార్పొరేట్ ఈవెంట్ జరుగుతుండగా, క్రేన్ విరిగిపడడంతో 'విస్టెక్స్' సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజు గాయపడ్డారు.
విస్టెక్స్ కంపెనీ తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను రామోజీ ఫిలింసిటీలో నిర్వహించుకుంటోంది. కొందరు అతిథులను కొంత ఎత్తు నుంచి నేరుగా వేదిక మీదకు దించుతుండగా, క్రేన్ కు ఉన్న తీగలు తెగిపోయాయి. దాంతో ఆ అతిథులు ఉన్న కంపార్ట్ మెంట్ పై నుంచి పడిపోయింది. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.