ఈసీ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాపై సస్పెన్షన్ వేటు
- తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నకిలీ ఓటరు కార్డుల కలకలం
- గిరీషా లాగిన్ నుంచి 30 వేల నకిలీ ఓటరు కార్డుల జారీ
- సస్పెన్షన్ కాలంలో విజయవాడ వదిలి వెళ్లరాదని గిరీషాకు ఆదేశాలు
ఏపీలో నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై ఈసీ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈసీ ఆదేశాలతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో విజయవాడను వదిలి వెళ్లవద్దని గిరీషాను రాష్ట్ర సీఎస్ ఆదేశించారు.
గతంలో, తిరుపతిలో ఓటర్ కార్డుల డౌన్ లోడ్ ఘటన సమయంలో గిరీషా ఆర్వోగా ఉన్నారు. ఆర్వోగా ఉండి లాగిన్ ను దుర్వినియోగం చేశారని గిరీషాపై అభియోగం వచ్చింది. కాగా, ఈసీ మరో ఐఏఎస్, ఐపీఎస్ పైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నకిలీ ఓట్ల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కేవలం గిరీషా లాగిన్ నుంచే 30 వేల నకిలీ ఓటరు కార్డులు సృష్టించినట్టు గుర్తించారు. గిరీషా తన లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ను సిబ్బందికి ఇచ్చేయడంతో భారీ ఎత్తున నకిలీ ఓటరు కార్డులు సృష్టించారని తెలిసింది.