అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ. 50 కోట్లు ఇచ్చారంటూ వార్తలు.. ఇందులో నిజం ఎంత?

  • భక్తుల ఆహార ఏర్పాట్లకు ప్రభాస్ రూ. 50 కోట్లు ఇచ్చారంటూ ప్రచారం
  • కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కూడా ఇదే విషయం చెప్పిన వైనం
  • ఇది ఫేక్ న్యూస్ అని తెలిపిన ప్రభాస్ టీమ్
అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ మందిరానికి ప్రభాస్ రూ. 50 కోట్లు విరాళం ఇచ్చారనేదే ఆ వార్త. రామ మందిర వేడుకు హాజరవుతున్న భక్తుల ఆహార ఏర్పాట్లకు ప్రభాస్ ఈ విరాళాన్ని ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలోని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, భక్తుల ఆహార ఖర్చులను ప్రభాస్ భరిస్తున్నారని చెప్పారు. దీంతో ఇది నిజం కావచ్చనే చాలా మంది భావించారు.

ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన టీమ్ తెలిపింది. ఇది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రభాస్ కు ఈ వేడుకకు ఆహ్వానం అందిందా? లేదా? అనే వార్తల్లో ఇంకా క్లారిటీ రాలేదు. డిసెంబర్ 22న జరుగుతున్న ఈ వేడుకకు దక్షిణాది నుంచి చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, ధనుష్ తదితర సెలబ్రిటీలకు ఆహ్వానం అందింది. సినిమాల విషయానికి వస్తే... ప్రభాస్ తాజా చిత్రం 'సలార్ పార్ట్ 1' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 'సలార్ పార్ట్ 2' 'స్పిరిట్' చిత్రాలు లైన్ లో ఉన్నాయి.


More Telugu News