అప్పటి వరకు ఈ రాజకీయాలు మారవు: సినీ నటుడు శివాజీ

  • సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకుంటున్నారన్న శివాజీ
  • ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలకు విన్నపం
  • దొంగ ఓట్లపై నిలదీయాలని సూచన
సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. దివంగత ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దోపిడీకి తెరలేపలేదని, సహజ వనరులను దోచుకోమని చెప్పలేదని అన్నారు. అలాంటి నాయకులు ఇప్పుడు లేరని అన్నారు. అనంతపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవద్దని ప్రజలను శివాజీ కోరారు. డబ్బుల కోసం కాకుండా, మీ బిడ్డల కోసం ఓట్లు వేయాలని కోరారు. మంచి నాయకులను ఎన్నుకున్నప్పుడే ఎన్టీఆర్ కు ఘన నివాళి ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. దొంగ ఓట్లపై ప్రజలు నిలదీయాలని సూచించారు. 

ఇదే కార్యక్రమంలో సినీ నటుడు నాగినీడు మాట్లాడుతూ... రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను సాధించడంపై సినీ నటులకు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం సినీ నటులు తమ వంతు కృషి చేయాలని అన్నారు.


More Telugu News