ఈ అంశంలో నాకు, కోచ్ ద్రావిడ్ కు పెద్దగా ఆందోళన లేదు: రోహిత్ శర్మ

  • జూన్ లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం
  • వెస్టిండీస్, అమెరికా సంయుక్త ఆతిథ్యం
  • జట్టు కూర్పుపై కసరత్తులు చేస్తున్నామన్న రోహిత్ శర్మ
  • పిచ్ లకు తగినట్టుగానే జట్టు ఎంపిక ఉంటుందని స్పష్టీకరణ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిన్న ఆఫ్ఘనిస్థాన్ పై విధ్వంసక సెంచరీతో మళ్లీ ఫామ్ లోకి రావడం తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ సన్నద్ధతపై స్పందించాడు. జట్టు కూర్పుపై మాట్లాడుతూ, ఇప్పటికీ తుది 15 మందితో కూడిన జట్టుపై ఓ నిర్ధారణకు రాలేదని తెలిపాడు. 

అయితే, వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని టీమిండియా మేనేజ్ మెంట్ ఓ పది మంది ఆటగాళ్లపై కన్నేసిందని వెల్లడించాడు. బ్యాటింగ్ కాంబినేషన్లపై ఆలోచిస్తున్నామని, టీ20 వరల్డ్ కప్ ఆతిథ్యమిచ్చే వెస్టిండీస్, అమెరికా పిచ్ లు వేటికవే భిన్నమైనవని, అందుకు తగినట్టుగానే తుది జట్టును ఖరారు చేస్తామని హిట్ మ్యాన్ చెప్పాడు. దీని గురించి తాను గానీ, కోచ్ రాహుల్  ద్రావిడ్ గానీ పెద్దగా ఆందోళన చెందడంలేదని తెలిపాడు. 

వరల్డ్ కప్ జట్టులో స్థానాన్ని ఆశించిన ఆటగాళ్లు, జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతే, వారు ఎందుకు ఎంపిక కాలేదో స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.


More Telugu News