కరీంనగర్‌లో రామాలయం, శివాలయాన్ని శుభ్రం చేసిన బండి సంజయ్
- ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్
- రామమందిర అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని సూచన
- అక్షింతలలో బాస్మతీ, రేషన్, జైశ్రీరామ్ బియ్యం ఉండవని సెటైర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం స్వయంగా కరీంనగర్‌లోని రామాలయం, శివాలయాన్ని శుభ్రం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన మేరకు ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... అయోధ్య రామమందిరానికి సంబంధించి రాముడి అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.
అక్షింతలలో బాస్మతీ బియ్యం.. రేషన్ బియ్యం.. జై శ్రీరామ్ బియ్యం ఉంటాయా? అని చురక అంటించారు. ఏవైనా అక్షింతలే అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. వాటి పవిత్రత తెలియకుండా మాట్లాడితే ఎలా? అన్నారు. అక్షింతల కార్యక్రమాన్ని విమర్శించే వారి ప్రాధాన్యతను తెలుసుకోవాలని సూచించారు. తెలియకుంటే మీ ఇంటి వారిని... మీ పక్కింటి వారిని.. అర్చకులను అడగాలని హితవు పలికారు.