అయోధ్య రామ మందిరంపై స్మారక స్టాంపులు ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం
- 6 స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోదీ
- పలు దేశాలు రాముడిపై విడుదల చేసిన స్టాంపులతో పుస్తకం కూడా ఆవిష్కరణ
జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా, ప్రధాని నరేంద్ర మోదీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో... గణనాథుడు, రామ మందిరం, హనుమంతుడు, శబరిమాత, జటాయువు, కేవత్ రాజ్ స్టాంపులను మోదీ నేడు ఆవిష్కరించారు. రామాయణాన్ని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను ప్రత్యేకంగా రూపొందించారు.
రాముడిపై ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా మోదీ నేడు విడుదల చేశారు. రాముడిపై ఇప్పటిదాకా 20 దేశాలు స్టాంపులు విడుదల చేయగా... వాటన్నింటినీ కూడా ఈ 48 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. వీటిలో ఐక్యరాజ్యసమితి రాముడిపై రూపొందించిన స్టాంపు కూడా ఉంది.