ఈ తరం వారికి ఈ దుర్మార్గుల గురించి తెలియదు: లక్ష్మీపార్వతి

  • నేడు ఎన్టీఆర్ వర్థంతి
  • నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్
  • ఎన్టీఆర్ ను దారుణంగా చంపేశారని ఆగ్రహం
  • వీళ్లకు ఏ విధంగా నైతిక హక్కు ఉందంటూ ఆక్రోశం
టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకూ పనికిరాని వెధవ... వాడికి చదువులేదు, సంస్కారం లేదు, చిన్నాపెద్దా లేదు, మర్యాద లేదు మన్నన లేదు... అలాంటి లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబునాయుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో దయచేసి గమనించండి అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. 

చరిత్ర సృష్టించిన ఒక మహానుభావుడు ఎన్టీఆర్ ను అతి దారుణంగా చంపారని, ఆయనకు నివాళి తెలిపేందుకు వీళ్లకు ఏ విధంగా నైతిక హక్కు ఉందో ఒక్కసారి ఆలోచించాలని ఈ యువతరాన్ని ప్రార్థిస్తున్నా అని తెలిపారు.

"ఆయన (ఎన్టీఆర్) వంశంలోని వ్యక్తి కాకపోయినా సరే పేదలకు మంచి చేయాలన్న స్ఫూర్తితో జగన్ ముందుకెళుతున్నారు. అటు తండ్రి వైఎస్సార్, ఇటు ఎన్టీఆర్ ఆలోచనలను అందిపుచ్చుకుని పాలన సాగిస్తున్నారు.

ఈ దండుపాళ్యం దండు నా జీవితంలో ఏ విధంగా నిప్పులు పోశారో, ఏ విధంగా నా భర్తను చంపేశారో... ఇవాళ ఏపీపైనా అబద్ధాలతో విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు, రామోజీ, పురందేశ్వరి, వాళ్ల కుటుంబ సభ్యులు ప్రజలను మర్కొకసారి వంచన చేయడానికి అనుక్షణం ప్రయతిస్తూనే ఉన్నారు. 

ఈ దుర్మార్గుల గురించి ఈ తరం వారికి తెలియదు. ఒక చారిత్రక పురుషుడిని సర్వనాశనం చేశారు వీళ్లు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారనేది యువతరం గమనించాలి. ఈ దుర్మార్గులు నన్ను, నా భర్తను బలిపశువులను చేశారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కారు, వ్యవస్థలన్నింటిని మేనేజ్ చేశారు. కోర్టుల నుంచి మీడియా వరకు... మీడియా అయితే చెప్పనక్కర్లేదు... పచ్చమీడియా అంతా ఒక చెంచాగిరీ చేసినట్టే చేస్తూ బాకాలు ఊదుతోంది" అంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు.


More Telugu News