రేణూ దేశాయ్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరో తెలుసా...?

రేణూ దేశాయ్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరో తెలుసా...?
  • ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ ఆసక్తికర పోస్టు
  • కుమార్తె ఆద్య బాక్సింగ్ చేస్తున్న వీడియో పంచుకున్న రేణూ
  • తనను ఎవరైనా ఇబ్బంది పెడితే కష్టాలు తప్పవని సరదాగా వ్యాఖ్యలు
ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు. తన కుమార్తె ఆద్య బాక్సింగ్ పంచ్ లు విసురుతున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. "ఇక నుంచి ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే వాళ్లకి నా పర్సనల్ సెక్యూరిటీతో కష్టాలు తప్పవు... జాగ్రత్త!" అంటూ రేణూ దేశాయ్ ఆ వీడియోపై సరదాగా వ్యాఖ్యానించారు. కుమార్తె ఆద్యను తన పర్సనల్ సెక్యూరిటీగా అభివర్ణిస్తూ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.


More Telugu News