సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో అంటే అంతేమరి!
- తమ మేనిఫెస్టోలో ఉచితాల ఊసే ఉండదన్న లక్ష్మీనారాయణ
- మేనిఫెస్టో ముసాయిదా రెడీ అవుతోందన్న జేబీఎన్‌పీ చీఫ్
- సలహాలు, సూచనలు ఇవ్వాలని అభ్యర్థన
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాలేకుండా ప్రజలపై ఉచిత హామీల వర్షం కురిపిస్తుంటాయి. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలను సైతం మర్చిపోతుంటాయి. సంక్షేమం పేరుతో ఎడాపెడా హామీలు గుప్పించడం షరా మామూలుగా మారింది. ఈ క్రమంలో అభివృద్ధిని అటకెక్కించేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా అది ఇస్తాం.. ఇది ఇస్తాం అని అంటున్నాయి తప్ప అది చేస్తాం.. ఇది చేస్తాం అని చెప్పే పార్టీలు దాదాపు కనుమరుగైపోయాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఉచితాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్న పార్టీ ఒకటుంది. అదే జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్‌పీ). సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఇటీవల ఈ పార్టీని ప్రారంభించారు. తమ ఎన్నికల మేనిఫెస్టో ముసాయిదా తయారవుతోందని, సలహాలు సూచనలు కావాలని ఎక్స్ ద్వారా ప్రజలను కోరారు. తమ మేనిఫోస్టోలో అభివృద్ధి మాత్రమే ఉంటుందని, ఉచితాలకు అందులో చోటు ఉండదని స్పష్టంగా పేర్కొన్నారు.