బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యత్యాసం కనిపించాలి: మంత్రి జూపల్లి
- ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాలని సూచన
- ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు బాధ్యత వహించాలన్న మంత్రి
- అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
గత బీఆర్ఎస్ పాలనకు... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన వ్యత్యాసం కనిపించేలా... ప్రజలు మెచ్చుకునేలా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలో ఐడీవోసీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలు మెచ్చేలా ప్రభుత్వ ఉద్యోగులు పని చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనకు మన ప్రభుత్వ పాలనకు వ్యత్యాసం కనిపించాలన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా అధికారులు బాధ్యత వహించాలని సూచించారు. గతంలో కనుక అలాంటివి జరిగి ఉంటే వాటిని రికవరీ చేస్తామన్నారు. అభివృద్ధిపై జరిగే సమావేశాల్లో ఇచ్చే నివేదికలకు... వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోందన్నారు. ఎవరైనా అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.