కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్... వీడియో ఇదిగో

కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్... వీడియో ఇదిగో
  • వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్న కేసీఆర్
  • వీడియోను పోస్ట్ చేసిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్
  • త్వరలో ప్రజల ముందుకు వస్తారన్న సంతోష్ కుమార్
గత నెలలో బాత్రూంలో జారిపడి గాయపడిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కర్ర సాయంతో నడుస్తోన్న వీడియోను రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవలి వరకు కేసీఆర్ బెడ్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే వైద్య సిబ్బంది సమక్షంలో కర్ర సాయంతో నడుస్తున్నారు.

సంతోష్ కుమార్ పోస్ట్ చేసిన వీడియోలో... కేసీఆర్ ఓ ఊతకర్ర సాయంతో.. వైద్య సహాయకుడి సమక్షంలో మెల్లిగా అడుగులు వేస్తున్నారు. అలా తన ఇంటి హాలు మొత్తం నడిచారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సంతోష్ కుమార్...  ఆయన ప్రతి అడుగులో దృఢ సంకల్పం కనిపిస్తోందని... కర్ర సాయంతో నడుస్తున్నాడని... త్వరలో ప్రజల ముందుకు వస్తారని పేర్కొన్నారు.


More Telugu News