ఫైబర్‌ నెట్‌ కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో జరగని విచారణ

  • ఈరోజు విచారణ జరపడం లేదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్
  • మరో కేసు విచారణలో బిజీగా ఉన్న జస్టిస్ బేలా త్రివేది
  • విచారణ తేదీని త్వరలో వెల్లడిస్తామన్న సుప్రీంకోర్టు
ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించలేదు. ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, పిటిషన్ ను ఈరోజు విచారించడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ వెల్లడించారు. విచారణ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. 

మరో న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది 14వ నెంబర్ కోర్టులో విచారణలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈరోజు ఫైబర్ నెట్ కేసులో విచారణను చేపట్టలేదు. చంద్రబాబు తరపున కేసును విచారించేందుకు సుప్రీంకోర్టుకు సిద్ధార్థ్ లూథ్రా వెళ్లారు. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసులోని అంశాలు 17ఏతో ముడిపడి ఉన్నందున గతంలో ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.


More Telugu News