విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టేసిన యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద.. నంబర్ 1 స్థానం కైవసం!
- ప్రజ్ఞానంద టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి
- టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్‌లో చైనా ఆటగాడిని ఓడించిన ప్రజ్ఞానంద
- ఫిడే ర్యాంకింగ్స్‌లో 11వ స్థానం
- 12వ స్థానానికి పడిపోయిన విశ్వనాథన్ ఆనంద్
భారత్‌కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను అధిగమించి నంబర్ 1 రికార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్‌లో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ ఓడించి ఈ ఘనత సాధించాడు.
ప్రజ్ఞానంద తన కెరియర్‌లో టాప్ ర్యాంక్‌లో నిలవడం ఇదే తొలిసారి. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయంట్లతో 11వ స్థానంలో ఉండగా, 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా భారత్ తరపున నంబర్ వన్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.