రజనీ కాంత్ గారి సినిమా ఆగిపోయిందని తెలిసి బాబాయ్ ఏం చేశారంటే..!: సుహాసిని
- కమల్ గురించి ప్రస్తావించిన సుహాసిని
- ఆయనే తనకి స్ఫూర్తి అని వ్యాఖ్య
- డబ్బుకు బాబాయ్ విలువ ఇవ్వలేదని వెల్లడి
- రజనీ మూవీ కోసం తన షూటింగ్ ఆపేశారని వివరణ
1980లలో హీరోయిన్ సుహాసిని ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత కాలంలో కీలకమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. తాజాగా 'మహా మ్యాక్స్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ... "మొదటి నుంచి కూడా నాకు ధైర్యం .. ఆత్మస్థైర్యం ఎక్కువే. అందువల్లనే ఇంత కెరియర్ ను చూశాననే నేను అనుకుంటున్నాను. నటన పరంగా .. వ్యక్తిత్వం పరంగా నాకు మా బాబాయ్ నే స్ఫూర్తి అని చెబుతాను" అన్నారు.
"మా బాబాయ్ తనకి పాత్ర నచ్చిందంటే డబ్బులు తక్కువిచ్చినా ఒప్పుకునేవారు .. అసలు డబ్బులు ఇవ్వకపోయినా చేసేవారు. అలా ఆయన డబ్బులు తీసుకోకుండా చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. నేను కూడా ఆయనను చూసి అలాగే చేస్తూ వెళ్లాను. పాత్ర నచ్చిందంటే డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచన చేయలేదు" అని చెప్పారు.
"రజనీకాంత్ గారి కెరియర్లో కీలకమైన సినిమాగా 'ముల్లుమ్ మలరమ్' కనిపిస్తుంది. మరో రెండు రోజుల పాటు షూటింగు చేస్తే ఆ సినిమా పూర్తవుతుంది. కానీ కెమెరా లేకపోవడం వలన ఆ షూటింగు ఆగిపోయింది. అప్పుడు కమల్ తన కాలు విరిగిపోయిందని తన సినిమా డైరెక్టర్ కి అబద్ధం చెప్పి, ఆ కెమెరాను రజనీకాంత్ గారి సినిమా షూటింగు కోసం పంపించారు. అలా మా బాబాయ్ నుంచి చాలానే నేర్చుకున్నాను" అన్నారు.