ప్రపంచ శక్తిమంతమైన టాప్-10 మిలిటరీల జాబితా విడుదల.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..!
- అగ్రస్థానాన్ని నిలుపుకున్న అమెరికా మిలిటరీ
- వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచిన రష్యా, చైనా
- నాలుగవ ర్యాంకులో నిలిచిన భారత్.. భూటాన్‌కు చిట్టచివరి స్థానం
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మిలిటరీ ర్యాంకుల సూచీ ‘గ్లోబల్ ఫైర్‌పవర్ ర్యాంకింగ్స్ 2024 (GFP)’ రిపోర్ట్ విడుదలైంది. దీని ప్రకారం, అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. రష్యా, చైనా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇక భారత సైన్యం 4వ స్థానంలో నిలిచింది. 60కి పైగా వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని దేశాల మిలిటరీ శక్తిసామర్థ్యాలకు జీఎఫ్‌పీ స్కోరును నిర్ణయించారు. సైనిక బలం, సామగ్రి, బడ్జెట్, ఆర్థిక స్థిరత్వం, భౌగోళిక స్థానం వంటి ప్రధానమైన అంశాల ఆధారంగా ర్యాంకింగ్‌లను నిర్ణయించారు. సూచీలో 0.0000 స్కోరు లభిస్తే 'సంపూర్ణమైన మిలిటరీ'గా పరిగణిస్తారు.
0.0699 స్కోరుతో అమెరికా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. 0.0702 స్కోర్‌తో రెండో స్థానంలో రష్యా, 0.0706 స్కోర్‌తో మూడో స్థానంలో చైనా నిలిచాయి. నాలుగవ ర్యాంకు దక్కించుకున్న భారత ఆర్మీ స్కోరు 0.1023గా ఉంది. పెద్ద సంఖ్యలో గ్రౌండ్ ఫోర్స్, దేశీయంగా భారీ సైనిక-పారిశ్రామిక సముదాయాలు భారత్‌ను టాప్-4 శక్తిమంతమైన మిలిటరీగా నిలిపాయి. కాగా 2022, 2023 గ్లోబల్ ఫైర్‌పవర్ సూచీలోనూ భారత్ నాలుగవ స్థానంలోనే నిలిచింది.
ఇక పొరుగు దేశం పాకిస్థాన్ అత్యంత శక్తిమంతమైన మిలిటరీలలో 9వ ర్యాంకులో నిలిచింది. దక్షిణ కొరియా, యూకే, జపాన్, టర్కీ, పాకిస్థాన్, ఇటలీ వరుసగా 5 నుంచి 10వ స్థానాల్లో ఉన్నాయి. 145 దేశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్స్ ఇవ్వగా 6.3704 స్కోరుతో భూటాన్ చిట్టచివరన నిలిచింది.