బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు... ఐసీసీ నిషేధం వేటు
- అబుదాబి టీ10 లీగ్ లో ఫిక్సింగ్
- నాసిర్ హొస్సేన్, మరో ఏడుగురిపై ఆరోపణలు
- తప్పును అంగీకరించిన బంగ్లాదేశ్ క్రికెటర్
- రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ
క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం అంతమయ్యేలాలేదు. తాజాగా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ నాసిర్ హోస్సేన్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. 2021-22 సీజన్ లో జరిగిన అబుదాబి టీ10 లీగ్ లో నాసిర్ హొస్సేన్ ఫిక్సింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ అయింది. ఆ సమయంలో అతడు పూణే డెవిల్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్, మరో ఏడుగురు ఫిక్సింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఫిక్సింగ్ కు సంబంధించిన అంశాలను బుకీలతో ఫోన్ లో మాట్లాడడం, వారి నుంచి ఐఫోన్ ను గిఫ్టుగా పొందడం, బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేయకపోవడం వంటి అభియోగాలు నిజమేనని వెల్లడైంది. దాంతో అతడిపై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నాసిర్ హొస్సేన్ అంగీకరించాడు.