ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లానుగానీ .. టెన్షన్ పడ్డాను: మహేశ్ బాబు
- ఈ నెల 14న విడుదలైన 'గుంటూరు కారం'
- రమణ అందరికీ నచ్చాడన్న మహేశ్ బాబు
- ఆ క్రెడిట్ త్రివిక్రమ్ కే దక్కుతుందని వెల్లడి
- తన పిల్లలు బాగా ఎంజాయ్ చేశారని వ్యాఖ్య
మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమాగా 'గుంటూరు కారం' సినిమా రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"రమణ పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం నేను గుంటూరు స్లాంగ్ ను ప్రాక్టీస్ చేయలేదు. సహజంగానే నేను ఇంట్లో అలాగే మాట్లాడేవాడిని. అందువలన తెరపై చూస్తున్నప్పుడు నేను కావాలని చెప్పినట్టు ఉండదు. అందువలన ఆడియన్స్ కి త్వరగా ఆ పాత్ర కనెక్ట్ అయింది .. ఆ క్రెడిట్ అంతా కూడా త్రివిక్రమ్ కే చెందుతుంది" అన్నారు.
"ఈ సినిమాను నేను ఫ్యామిలీతో కలిసి 'సుదర్శన్' థియేటర్లో చూశాను. థియేటర్ కి అనేసరికి మా ఆవిడ కంగారు పడిపోయింది. నేను తనకి కాస్త ధైర్యం చెప్పి తీసుకెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత ఆ క్రౌడ్ చూసి, అసలే పిల్లలతో కలిసి వచ్చాననే ఆలోచన చేస్తూ టెన్షన్ పడిపోయాను. థియేటర్ ఎక్స్ పీరియన్స్ ను వాళ్లు బాగా ఎంజాయ్ చేశారు" అని అన్నారు.