బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యేకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులు
- బేల మండలం ఖోగదూర్ గ్రామంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఘన స్వాగతం
- గుర్రంపై కూర్చోబెట్టి గ్రామంలో డీజే డప్పు వాయిద్యాల మధ్య విజయోత్సవ ర్యాలీ
- గ్రామస్థులు చూపిన అభిమానాన్ని మరిచిపోలేనన్న పాయల్ శంకర్
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు ఓ గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన గెలిచాక తొలిసారి జిల్లాలోని బేల మండలం ఖోగదూర్ గ్రామానికి వచ్చారు. దీంతో గ్రామస్థులు ఎమ్మెల్యేను గుర్రంపై కూర్చోబెట్టి గ్రామంలో డీజే డప్పు వాయిద్యాల మధ్య విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ... ఖోగదూర్ గ్రామ ప్రజలు తన పట్ల చూపిన అభిమానాన్ని మరిచిపోలేనని... గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. పాయల్ శంకర్ ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 7వేల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నపై విజయం సాధించారు.