చంచల్ గూడ మహిళా జైలును పవన్ కల్యాణ్ సందర్శించినప్పటి పాత ఫొటోను పంచుకున్న జనసేన

  • పవన్ కల్యాణ్ సామాజిక స్పృహపై జనసేన ట్వీట్
  • జనసేన పెట్టక ముందు నుంచి పవన్ సామాజిక బాధ్యతతో మెలిగారని వెల్లడి
  • చంచల్ గూడ జైలులో మహిళా ఖైదీల స్థితిగతులు తెలుసుకున్నారని వివరణ
జనసేనాని పవన్ కల్యాణ్ ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని తెలిసిందే. ఒక సామాజిక బాధ్యతగా భావించే ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో ఆయనే చెప్పారు. కాగా, జనసేన పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర ఫొటో పంచుకుంది. పాతికేళ్ల కిందట పవన్ కల్యాణ్ చంచల్ గూడ జైలును సందర్శించినప్పటి ఫొటో అది. 

"ఐపీఎస్ అధికారి ఎంవీ కృష్ణారావు జైళ్ల శాఖ డీజీగా ఉన్న సమయంలో 1999లో పవన్ కల్యాణ్ చంచల్ గూడలోని మహిళా జైలును సందర్శించారు. అందులోని మహిళా ఖైదీల స్థితిగతులను పవన్ కల్యాణ్ గారు స్వయంగా తెలుసుకున్న సందర్భం ఇది. ఈ ఫొటోలో పవన్ కల్యాణ్ తో పాటు అప్పటి డీఐజీ నరసింహారెడ్డి, మహిళా జైలు సూపరింటిండెంట్ లక్ష్మి ఉన్నారు. పవన్ కల్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా సమాజం పట్ల బాధ్యతతోనే వ్యవహరించారు" అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది.


More Telugu News