వచ్చే ఎన్నికల్లో కూడా నేను పోటీ చేయను: వైవీ సుబ్బారెడ్డి
- ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
- ఒంగోలులోని నివాసానికి వచ్చిన వైవీ సుబ్బారెడ్డి
- తాను గత ఎన్నికల్లోనూ పోటీకి దూరంగా ఉన్నానని వెల్లడి
- ఈసారి కూడా తన నిర్ణయంలో మార్పు లేదని స్పష్టీకరణ
ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వైసీపీ ముఖ్య నేత, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని స్పష్టం చేశారు.
తాను 2019లోనే ఎన్నికలకు దూరంగా ఉన్నానని, ఆ విషయాన్ని అప్పట్లోనే సీఎం జగన్ కు వివరించానని తెలిపారు. ఈసారి కూడా తన నిర్ణయంలో మార్పులేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏం చెబితే అది చేస్తానని, ఆయన నిర్ణయమే తనకు శిరోధార్యమని అన్నారు.
సంక్రాంతి సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి ఒంగోలులోని తన నివాసానికి వచ్చారు. వైవీ రాక నేపథ్యంలో, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. వారి సమక్షంలో ఆయన సంక్రాంతి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేస్తున్నారని... అయితే, అభ్యర్థుల మార్పు కారణంగా కొందరు అసంతృప్తికి గురైన మాట వాస్తవమేనని తెలిపారు. త్వరలోనే ఈ పరిస్థితులన్నీ సర్దుకుంటాయని, అందరూ కలిసికట్టుగా నియోజకవర్గ అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారని అన్నారు. ఇక బాలశౌరి, సి.రామచంద్రయ్య వంటి వారు ఇతర కారణాలతో పార్టీ నుంచి వెళ్లిపోయారని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఆయన ఈ సందర్భంగా షర్మిల అంశంపైనా స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆ ప్రభావం వైసీపీపై ఉంటుందనడం అర్థరహితం అని పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్ లోకి వచ్చారనో, లేక ఇతర కారణాలతోనో అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.