ప్రధాని నరేంద్రమోదీకి తాను రాసిన పుస్తకం కాపీని అందించిన ప్రణబ్ కూతురు

  • 'ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్' అనే బుక్‌ను రాసిన శర్మిష్ఠ ముఖర్జీ
  • ఇందులో తన తండ్రితో మోదీకి ఉన్న అనుబంధాన్ని పేర్కొన్న శర్మిష్ఠ
  • తన తండ్రి ప్రణబ్ పట్ల మోదీ సానుకూల ధోరణితో ఉన్నారంటూ ట్వీట్ 
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయ, రచయిత్రి శర్మిష్ఠ ముఖర్జీ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. తాను రాసిన 'ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్' అనే పుస్తకం కాపీనీ ప్రధానికి అందించారు. తన తండ్రితో ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న బలమైన వ్యక్తిగత అనుబంధాన్ని ఈ పుస్తకంలో శర్మిష్ఠ పేర్కొన్నారు. కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వంపై మోదీ తీవ్ర విమర్శలు చేసినప్పటికీ... తన తండ్రి ప్రణబ్ పట్ల మాత్రం సానుకూల ధోరణితో ఉండేవారని... ఈ విషయం తెలిసి తన తండ్రి ఆశ్యర్యపోయారని పేర్కొన్నారు.

తాను ప్రధాని మోదీకి ఈ పుస్తకం కాపీనీ అందించానని శర్మిష్ఠ ముఖర్జీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ మేరకు ఫోటోలు షేర్ చేశారు. 'ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్' అనే పుస్తకం కాపీని ప్రధానికి అందించానని... ఆయన ఎప్పటిలాగే తన పట్ల ఆదరాభిమానాలు చాటారని, తన తండ్రి పట్ల గౌరవం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. ఇందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ ముగించారు.


More Telugu News