మంత్రి దామోదర ఫేస్ బుక్ పేజీలో టీడీపీ పోస్ట్

  • డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పోస్టులతో ప్రచారం
  • అనుచరుల ఫోన్ కాల్ తో అప్రమత్తమైన దామోదర
  • ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ చేశారన్న మంత్రి
  • అందులో పెట్టే సందేశాలకు స్పందించ వద్దంటూ విజ్ఞప్తి
తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ ఖాతాలో ఇతర పార్టీలకు చెందిన పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే తదితర పార్టీలకు చెందిన పోస్టులతో పాటు విదేశాలకు చెందిన పలు పోస్టులు కనిపించాయి. వీటిని చూసిన మంత్రి అనుచరులు వెంటనే ఆయనకు ఫోన్ లో సమాచారం అందించారు. దీంతో తన ఫేస్ బుక్ పేజీ చెక్ చేసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ.. అది హ్యాకింగ్ కు గురైందని గుర్తించారు. ఇదే విషయం చెబుతూ ప్రజలు, పార్టీ నేతలు, అనుచరులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. తన ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్థులు హ్యాక్ చేశారని, అందులో పెట్టే సందేశాలకు స్పందించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజీలో వందలాదిగా ఇతర పార్టీలకు చెందిన పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ పోస్టులు మంత్రి ఫాలోవర్లకు చేరడం, అందులో ప్రత్యర్థి పార్టీలకు చెందినవి ఉండడంతో వారంతా ఖంగుతిన్నారు. పార్టీ నేతలు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన మంత్రి దామోదర.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజీ నుంచి వచ్చే సందేశాలకు రెస్పాండ్ కావొద్దని మంత్రి అనుచరులు పార్టీ కార్యకర్తలకు సూచించారు.


More Telugu News