ఇన్నాళ్లు నేను సినిమాలు చేయకుండా బతికానంటే ఆ వ్యాపారమే కాపాడింది: శివాజీ
- ఇటీవల బిగ్ బాస్ షోతో అందరినీ అలరించిన నటుడు శివాజీ
- తాజాగా ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ
- సొంతూరిలో ఆస్తులు ఉన్నాయని వెల్లడి
- సినిమాలు తీయడానికి హైదరాబాదులో ఆస్తులు అమ్మేశానని వివరణ
నటుడు శివాజీ ఇటీవల బిగ్ బాస్ రియాలిటీ షోతో అందరినీ అలరించారు. బిగ్ బాస్ సీజన్-7లో ఫైనల్ మెట్టు వరకు చేరగలిగారు. కాగా, సంక్రాంతి సందర్భంగా శివాజీ ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
తనకు సొంతూరిలో ఆస్తులు ఉన్నాయని, అయితే హైదరాబాదులోని ఆస్తులను మాత్రం అమ్మేయాల్సి వచ్చిందని వెల్లడించారు. సినిమాలు తీయడానికి తాను ఇక్కడి ఆస్తులను అమ్మేశానని, అందుకు తానేమీ చింతించడంలేదని శివాజీ స్పష్టం చేశారు.
తాను చొక్కా, ప్యాంటుతో హైదరాబాద్ వచ్చానని, సినిమాలు చేయబట్టే ఈస్థాయికి చేరుకున్నానని తెలిపారు. తాను సినిమాలు చేయడం వల్ల చాలామందికి లైఫ్ దొరికిందని అన్నారు. తన మిత్రుల్లో కొందరు నిర్మాతలయ్యారని, కొందరు దర్శకులు అయ్యారని శివాజీ వెల్లడించారు.
సినీ పరిశ్రమ తనకు ఇచ్చిన దాంతో భూములపై పెట్టుబడి పెట్టానని, లాభాలు వచ్చాయని వివరించారు. పదేళ్ల పాటు తాను సినిమాలు చేయకపోయినా బతికానంటే భూముల వ్యాపారమే తనను కాపాడిందని పేర్కొన్నారు.
ఇన్నేళ్లలో తాను ఎవరి వద్ద చేయి చాచింది లేదని శివాజీ స్పష్టం చేశారు. ఏ పార్టీ దగ్గరైనా సరే శివాజీ డబ్బులు అడిగాడు అంటే ఈ క్షణమే చచ్చిపోతానని అన్నారు. తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని చెప్పారు. అలా దిగజారి ఉండుంటే మాత్రం డబ్బుపరంగా చాలా ఎత్తులో ఉండేవాడ్నని తెలిపారు.