బస్తర్ అడవుల్లో డ్రోన్ దాడి జరిగిందంటూ మావోయిస్టుల లేఖ

  • ప్రభుత్వం తమపై వైమానిక దాడులకు దిగుతోందన్న మావోలు
  • 2021 నుంచి బస్తర్ అడవుల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని ఆరోపణ
  • పలు ప్రాంతాల్లో బాంబులు పడ్డాయని వెల్లడి
ప్రభుత్వం తమపై వైమానిక దాడులకు దిగుతోందంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. చత్తీస్ గఢ్ లోని బస్తర్ అడవుల్లో డ్రోన్ దాడి జరిగిందంటూ మావోలు లేఖ విడుదల చేశారు. సుక్మా, బీజాపూర్ సరిహద్దుల్లో డ్రోన్ బాంబులు పడినట్టు లేఖలో వెల్లడించారు. మెట్టగూడ, బొట్టెటంగ్, ఎర్రన్ పల్లి అటవీప్రాంతాల్లోనూ బాంబులు పడ్డాయని వివరించారు. 2021 నుంచి బస్తర్ అడవుల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయని నక్సల్స్ స్పష్టం చేశారు. కాగా, తాజాగా దక్షిణ బస్తర్ అడవుల్లో డ్రోన్ దాడి జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక గిరిజనులు ఆందోళనకు గురైనట్టు సమాచారం.


More Telugu News