నేటి నుంచే ఆస్ట్రేలియన్ ఓపెన్... శుభారంభం చేసిన జకోవిచ్
- టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ సీజన్ ప్రారంభం
- తొలి రౌండ్ లో విజయం సాధించిన టాప్ సీడ్ జకోవిచ్
- టీనేజి ఆటగాడు డినో ప్రిజ్మిక్ పై గెలుపు
టెన్నిస్ ప్రేమికులను అలరించేందుకు గ్రాండ్ సీజన్ షురూ అయింది. ఈ సీజన్ లో మొదటిది అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మెల్బోర్న్ లో నేడు ప్రారంభం అయింది. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ శుభారంభం చేశాడు. క్రొయేషియాకు చెందిన అన్ సీడెడ్ ఆటగాడు డినో ప్రిజ్మిక్ తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ లో జకోవిచ్ 6-2, 6-7, 6-3, 6-4తో విజయం సాధించాడు.
వరుసగా నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ లో విజేతగా నిలుస్తున్న జకోవిచ్ కు నేటి మ్యాచ్ లో 18 ఏళ్ల టీనేజి ఆటగాడు ప్రిజ్మిక్ నుంచి ఓ మోస్తరు ప్రతిఘటన ఎదురైంది. తొలి సెట్ ను జకోవిచ్ సునాయాసంగానే గెలిచినా, రెండో సెట్ లో ప్రిజ్మిక్ పుంజుకుని టైబ్రేకర్ వరకు తీసుకెళ్లాడు. ఆ సెట్ ను టైబ్రేకర్ లో ప్రిజ్మిక్ 7-5తో గెలుచుకున్నాడు. అయితే, డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ ఆ తర్వాత వరుసగా మూడు, నాలుగు సెట్లు గెలిచి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.
ఇవాళ జరిగిన ఇతర మ్యాచ్ ల్లో నాలుగో సీడ్ జానిక్ సిన్నర్, 12వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్, 22వ సీడ్ సెరుండాలో తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్ చేరుకున్నారు.
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో... వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలో దిగిన అలైజ్ కార్నెట్ ను క్వాలిఫయర్ గా వచ్చిన టిమోఫీవా వరుస సెట్లలో మట్టికరిపించింది. మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ, మాజీ వరల్డ్ నెంబర్ వన్ కరోలిన్ వోజ్నియాకి రెండో రౌండ్ చేరింది. 20వ సీడ్ లినెట్టేతో పోరులో వోజ్నియాకి 6-2, 2-0తో ఆధిక్యంలో ఉన్న దశలో... లినెట్టే గాయంతో వైదొలగింది.
9వ సీడ్ బార్బరా క్రెజ్సికోవా కూడా ముందంజ వేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ హోంటామాతో జరిగిన పోరులో క్రెజ్సికోవా 2-6, 6-4, 6-3తో విజయం సాధించింది.