సంక్రాంతి వేళ హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్... మూడ్రోజులు అన్ లిమిటెడ్ ప్రయాణం
- సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు జనాలు పయనం
- బోసిపోయినట్టుగా కనిపిస్తున్న భాగ్యనగరం
- ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు హైదరాబాద్ మెట్రో కొత్త ప్లాన్
- సూపర్ సేవర్ కార్డుపై అన్ లిమిటెడ్ ప్రయాణ సదుపాయం
సంక్రాంతి వచ్చిందంటే జనాల్లో జోష్ మామూలుగా ఉండదు. భోగి, సంక్రాంతి, కనుమ... ఇలా మూడ్రోజులూ ఎంతో విశిష్టత ఉన్న పర్వదినాలు కావడంతో సంబరాలకు కొదవ ఉండదు.
ఇక, హైదరాబాదులో అయితే ఈ మూడ్రోజులు సెలవు దినాలు కావడంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లిపోతారు. దాంతో నగరం చాలావరకు ఖాళీగా కనిపిస్తుంది. ఈసారి కూడా అందులో పెద్ద తేడా లేదు. నగరం బోసిపోయినట్టు కనిపిస్తోంది. చూద్దామన్నా రోడ్లపై రద్దీ కనిపించడంలేదు.
ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని పెంచుకోవడం కోసం... అన్ లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే చాలు... మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది.
మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.