రమణగాడి ధమాకా... 'గుంటూరు కారం' రెండ్రోజుల కలెక్షన్స్ ఇవిగో!

  • మహేశ్ బాబు హీరోగా గుంటూరు కారం
  • హారిక అండ్ హాసిని బ్యానర్ పై త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 12న విడుదలైన గుంటూరు కారం
మహేశ్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాధారణంగా మహేశ్ బాబు సినిమాలకు వచ్చే ఓపెనింగ్ టాక్ ఈ సినిమాకు రాలేదు. రివ్యూల్లో అత్యధికం నెగెటివ్ గానే వచ్చాయి. 

ఒక్కసారి గుంటూరు కారం కలెక్షన్లు వెల్లడైతే నెగెటివ్ ప్రచారం దానంతట అదే ఆగిపోతుందని దిల్ రాజు వంటి సీనియర్ నిర్మాత వ్యాఖ్యానించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ క్రమంలో గుంటూరు కారం చిత్రబృందం రెండ్రోజుల గ్రాస్ వివరాలు వెల్లడించింది. "రమణగాడి సూపర్ సంక్రాంతి బ్లాక్ బస్టర్... గుంటూరు కారం రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.127 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ భోగి పండుగకు మీలో ఉన్న ఇగోలు, ద్వేషాన్ని కాల్చేస్తారని ఆశిస్తూ, మీ అందరికీ భోగి శుభాకాంక్షలు" అంటూ చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్వీట్ చేసింది. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రంలో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.


More Telugu News