ఈసీఐఎల్ లో 1100 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

  • ఈ నెల 16 తో ముగియనున్న దరఖాస్తు గడువు
  • ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులకు అవకాశం
  • ఆన్ లైన్ లో దరఖాస్తు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేపట్టే ఈ నియామక ప్రక్రియకు ఈ నెల 16వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. తొలుత నాలుగు నెలల కాలానికి అభ్యర్థులను ఎంపిక చేసినా.. పనితీరు ఆధారంగా పొడిగింపు ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

ఖాళీలు:
  • ఎలక్ట్రానిక్స్ / మెకానిక్ - 275 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ - 275 పోస్టులు
  • ఫిట్టర్ - 550 పోస్టులు

అర్హతలు:
  • అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లేదా ఫిట్టర్ ట్రేడ్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్‌తో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • అప్రెంటిస్ షిప్ పూర్తయ్యాక ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ తయారీలో కనీసం ఒక ఏడాది అనుభవం 
  • జనవరి 16, 2024 నాటికి అభ్యర్థుల వయసు 30 ఏళ్లకు మించకూడదు
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు

ఎంపిక ప్రక్రియ:
  • దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తిచేసి నియామకం చేపడతారు.
  • ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.22,528 జీతం అందుకుంటారు.


More Telugu News