సంతానలేమికి కారుసీటూ కారణం కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త!
- సీటు వేడి కారణంగా తగ్గిపోయే వీర్యకణాల సంఖ్య
- బిగుతైన ప్యాంట్లు ధరించడం, కారు, బైక్‌పై ఎక్కువసేపు ప్రయాణించడం కూడా ముప్పే
- చలికాలంలో పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్న అధ్యయనకారులు
ఇటీవలి కాలంలో సంతానలేమితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇందుకున్న సవాలక్ష కారణాల్లో కారు సీటు కూడా ఒకటని తాజా పరిశోధనలో వెల్లడైంది. కారు సీటు వేడిగా ఉండడం వల్ల శుక్రకణాల ఉత్పత్తికి హాని జరిగి అది సంతానలేమికి కారణం అవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. సంతానోత్పత్తికి అవసరమైన వీర్యకణాల ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలని అధ్యయనం పేర్కొంది.
కారులోనో, బైక్‌పైనో ప్రయాణిస్తున్నప్పుడు సీటు వేడిగా ఉండడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. బిగుతైన ప్యాంట్లు ధరించడం, కారు, బైక్‌పై ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. శీతాకాలంలో వెచ్చని సీట్లు, దుప్పట్లు హాయిని ఇస్తాయని, కానీ ఇది దీర్ఘకాలం కొనసాగితే అది వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.
ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే చలికాలంలో వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని రీప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్, కింగ్స్ ఫెర్టిలిటీ డైరెక్టర్ డాక్టర్ ఇప్పోక్రటిస్ సారిస్ వివరించారు. బిగుతైన ప్యాంట్లు ధరించడం, వాహనంపై చాలాసేపు కూర్చోవడం వల్ల కూడా వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసీ పేర్కొన్నారు.