వన్డేలు, టీ20ల్లో ఆడే అర్హత అశ్విన్‌కు లేదు.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు

  • ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో జరిగిన చాట్‌లో యువీ వ్యాఖ్యలు
  • అశ్విన్ గొప్ప బౌలర్ అని ప్రశంస
  • పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బౌలింగ్‌ ఒక్కటే సరిపోదన్న యువీ
టీమిండియా స్టార్ బౌలర్, ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బౌలర్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్‌‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో జరిగిన చాట్‌లో అశ్విన్ వైట్‌బాల్ కెరియర్‌పై అడిగిన ప్రశ్నకు యువీ స్పందిస్తూ.. వన్డే, టీ20 జట్టులో చోటుకు అతడు అర్హుడు కాదని తేల్చి చెప్పాడు. అందుకు కారణం కూడా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఎప్పుడూ ఆటగాడి చుట్టూనే తిరుగుతుందని, అశ్విన్ గొప్ప బౌలరే అయినా బ్యాట్‌తో పరుగులు రాబట్టలేడని, అదే అతడికి మైనస్ అని చెప్పుకొచ్చాడు.  

యువరాజ్, అశ్విన్ ఇద్దరూ 2011 వన్డే ప్రపంచకప్‌ ఆడారు. సమయం వచ్చినప్పడల్లా యువరాజ్‌పై అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించేవాడు. భారత జట్టుకు అతడు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడేవాడు. యువీకి క్యాన్సర్ అన్న విషయం తెలిసినప్పుడు అశ్విన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు.


More Telugu News