బాబా రామ్‌దేవ్ 'ఓబీసీ' వ్యాఖ్యలపై వివాదం... నేను అలా అనలేదంటూ యోగా గురు వివరణ
- నన్ను ఓబీసీ అంటారు.. కానీ నేను వేద బ్రాహ్మణుడ్ని అని రామ్‌దేవ్ అన్నట్లుగా నెట్టింట వీడియో వైరల్
- ఓబీసీలను కించపరిచారంటూ విమర్శలు
- ఎక్స్‌లో Boycott_Patanjali హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్
- ఓబీసీలను అనలేదు... ఓవైసీని అన్నానంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం
సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్‌లో Boycott_Patanjali అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇందుకు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలే కారణమని చెబుతున్నారు. ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడిన బాబా రామ్‌దేవ్... "నా మూల గోత్రం బ్రహ్మగోత్రం... నేను అగ్నిహోత్రి బ్రాహ్మణుడను... కొంతమంది బాబాజీ ఓబీసీ కదా అంటారు.. కానీ నేను వేద బ్రాహ్మణుడను... ద్వివేది బ్రాహ్మణుడను... త్రివేది బ్రాహ్మణుడను... చతుర్వేది బ్రాహ్మణుడను... నాలుగు వేదాలు చదివాను" అని వ్యాఖ్యానించినట్లుగా ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
దీంతో ఆయన ఓబీసీలను కించపరిచారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో పతంజలి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ఎక్స్ వేదికగా ట్రెండింగ్ నడుస్తోంది.
పతంజలి ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ఎక్స్‌లో ట్రెండ్ కావడంతో శనివారం బాబా రామ్‌దేవ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఓబీసీ అని పలకలేదన్నారు. తాను ఆ సమయంలో అన్నది ఓవైసీని అని... అతని పూర్వీకులు దేశ వ్యతిరేకులని ఆరోపించారు. తాను అతనిని సీరియస్‌గా తీసుకోనని వ్యాఖ్యానించారు. ఓబీసీపై తాను మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు.