ఉండవల్లిలో సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్

  • కీలక సమావేశానికి వేదికగా చంద్రబాబు నివాసం
  • త్వరలో ఏపీలో ఎన్నికలు
  • సీట్ల సర్దుబాటు, బీజేపీతో పొత్తుపై చర్చించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం కీలక సమావేశానికి వేదికగా నిలిచింది. చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమై ఎన్నికల నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు. 

బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు... టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల  నుంచి వలస వస్తున్న నేతలు... తదితర అంశాలపై చర్చ జరిగింది. కాగా, తొలి జాబితాను ఉమ్మడిగా కలిసి విడుదల చేసేందుకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించారు. 

తొలి జాబితాలో టీడీపీ-జనసేన నుంచి ఎవరెవరి పేర్లు ప్రకటించాలన్న దానిపై చంద్రబాబు, పవన్, లోకేశ్ చర్చించారు. దీనిపై చంద్రబాబు, పవన్ ఓ అవగాహనకొచ్చినట్టు తెలిసింది. 

ఇప్పటికే వైసీపీ 3 జాబితాలు విడుదల చేయడం ద్వారా ఎన్నికల రేసులో ప్రత్యర్థి పార్టీల కంటే ముందు నిలిచింది. ఈ నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపిక కసరత్తులపై వేగం పెంచాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.


More Telugu News