స్కిల్ కేసులో ఈ నెల 16న సుప్రీంకోర్టు తీర్పు

  • టీడీపీ అధినేతపై స్కిల్ కేసు
  • గత అక్టోబరు 20న తుది విచారణ
  • సెక్షన్ 17ఏ వర్తింపుపై వాదనలు  విన్న సుప్రీంకోర్టు
  • తీర్పును రిజర్వ్ లో ఉంచిన అత్యున్నత న్యాయస్థానం
టీడీపీ అధినేత చంద్రబాబు విచారణ ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీం కోర్టు ఈ నెల 16న తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో సెక్షన్ 17ఏ వర్తింపజేసే అంశంలో అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే వాదనలు విన్నది. గత అక్టోబరు 20న తుది విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. 

స్కిల్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విపక్ష నేతనైన తనను గవర్నర్ అనుమతి తీసుకోకుండానే అరెస్ట్ చేయడాన్ని ఆయన అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. తన పిటిషన్ లో 17ఏ సెక్షన్ ను ప్రస్తావించారు. 

అయితే, చంద్రబాబుకు 17ఏ వర్తించదని ఏపీ సీఐడీ వాదించింది. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ నెల 16న జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించనుంది.


More Telugu News