రాహుల్ గాంధీ యాత్ర... మణిపూర్‌కు వెళ్లనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- ఆదివారం ఉదయం మణిపూర్ వెళ్లనున్న రేవంత్ రెడ్డి
- తొలి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి రాక
- ఆ తర్వాత దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు బయలుదేరనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మణిపూర్‌కు వెళ్లనున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేబట్టే భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి మణిపూర్ వెళ్లనున్నారు. తొలి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వస్తారు. అనంతరం దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా దావోస్‌కు వెళ్లనున్నారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఏఐసీసీ అగ్రనాయకులు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారితో రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. రెండు ఎమ్మెల్సీల నామినేషన్లపై చర్చించనున్నారు. కాగా, మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి కాకుండా తౌబాల్ జిల్లాలోని ఓ ప్రయివేటు స్థలం నుంచి రాహుల్ గాంధీ న్యాయ యాత్ర ప్రారంభం కానుంది.