పెనమలూరులో చంద్రబాబు పోటీ చేసినా గెలుపు నాదే: జోగి రమేశ్

  • జగన్ ఏది చెపితే అది చేయడానికి తాను సిద్ధమన్న జోగి రమేశ్
  • విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలుస్తారని వ్యాఖ్య
  • విధిలేని పరిస్థితుల్లో జగన్ ను నాని తిట్టి ఉండొచ్చన్న రమేశ్
పెనమలూరు నియోజకవర్గంలో తన విజయం తథ్యమని... చంద్రబాబు పోటీ చేసినా గెలుపు తనదేనని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. పెడనలో తన సిట్టింగ్ స్థానం నుంచి ఎవరు పోటీ చేసినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. తమ అధినేత జగన్ ఏది చెపితే అది చేయడానికి తాను సిద్ధమని అన్నారు. 2009లో పెడన నుంచి పోటీ చేశానని... 2014లో మైలవరం నుంచి తనను జగన్ పోటీ చేయించారని, కానీ అప్పుడు ఓడిపోయానని చెప్పారు. ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గానికి పంపుతున్నారని... అక్కడ కచ్చితంగా గెలుస్తానని అన్నారు. 

విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలవడం ఖాయమని జోగి రమేశ్ చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో జగన్ ను కేశినేని నాని తిట్టాల్సి ఉంటుందని అన్నారు. విధిలేని పరిస్థితుల్లో నాని అలా మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. మరోవైపు, పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథికి ఆ స్థానాన్ని జగన్ కేటాయించని సంగతి తెలిసిందే. దీంతో, ఆయన టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు.


More Telugu News