కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందుత్వం ఉంది: టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

  • కాంగ్రెస్ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదన్న మల్లు రవి
  • మోదీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదని వ్యాఖ్య
  • కేసీఆర్, వారి కుటుంబం కోసమే బీఆర్ఎస్ పని చేసిందని ఆరోపణ
కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందుత్వం ఉందని... కానీ హిందుత్వ పేరుతో బీజేపీ భారత దేశాన్ని విడదీయాలని చూస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఏ మతానికీ వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి లేదన్నారు.

ప్రశ్నించిన ప్రతిపక్షాలను కూడా ఈడీ, సీబీఐ పేరుతో అణచివేసే కుట్ర జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ న్యాయ్ జోడో యాత్రపై బీజేపీ నేతల వ్యాఖ్యలను మల్లు రవి ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సంక్షేమం.. వారి అభివృద్ధి కోసమే పని చేసిందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పక్కన పెట్టారన్నారు.


More Telugu News